ఆడవాళ్ళని మగవాళ్ళు ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేరు. అర్ధ(సగం)మే చేసుకుంటారు. కొండొకచో అపార్థం కూడా చేసుకోగలరు. అర్థం చేసుకోవడానికి జరిగిన ప్రయత్నంలోంచే గా ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అనే మాటలు, పాటలు పుట్టాయి మరి.....
ఆడవాళ్ళనర్ధం చేసుకొనే ప్రయత్నంలో ఈ మధ్య కొందరు ఇంజనీర్లు ఇలా కనిపెట్టేరుట. ఏదో ప్రయత్నం చేస్తున్నార్లెండి పాపం....
ఆ పరిశోధనలో ఏం తేల్చారో మీరూ చూడండి. నవ్వొస్తే నవ్వుకోండి
. ఇందులో కొన్ని నిజాలున్నాయని మీకనిపించినా ఎవరికీ (ముఖ్యంగా మీ శ్రీవారికి) చెప్పకండేం...... అదిగో చూసావా...నేనప్పుడే చెప్పలా...మీ ఆడవాళ్ళింతే, ఆ ఇంజనీర్లు చెప్పారుగా అంటూ బడాయిలు పోతారు. ఈ పరిశోధనలో ఆవగింజంతైనా నిజంలేదని తీవ్రంగా ఖండించేయండేం.....



