07 May 2010

మనమీదేనర్రోయ్......

ఆడవాళ్ళని మగవాళ్ళు ఎప్పటికీ పూర్తిగా  అర్థం చేసుకోలేరు. అర్ధ(సగం)మే చేసుకుంటారు. కొండొకచో అపార్థం కూడా చేసుకోగలరు. అర్థం చేసుకోవడానికి జరిగిన ప్రయత్నంలోంచే గా ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అనే మాటలు, పాటలు పుట్టాయి మరి.....
ఆడవాళ్ళనర్ధం చేసుకొనే ప్రయత్నంలో ఈ మధ్య కొందరు ఇంజనీర్లు ఇలా కనిపెట్టేరుట. ఏదో ప్రయత్నం చేస్తున్నార్లెండి పాపం....
 ఆ పరిశోధనలో ఏం తేల్చారో మీరూ చూడండి. నవ్వొస్తే నవ్వుకోండి

. ఇందులో కొన్ని నిజాలున్నాయని మీకనిపించినా ఎవరికీ (ముఖ్యంగా మీ శ్రీవారికి) చెప్పకండేం...... అదిగో చూసావా...నేనప్పుడే చెప్పలా...మీ ఆడవాళ్ళింతే, ఆ ఇంజనీర్లు చెప్పారుగా  అంటూ బడాయిలు పోతారు. ఈ పరిశోధనలో ఆవగింజంతైనా నిజంలేదని తీవ్రంగా ఖండించేయండేం.....

8 comments:

  1. ఈ అభిప్రాయం కేవలం ఈ post మీద కాదండీ. ఇవాళే మీ Blog నా కంట పడింది. మొత్తం అన్ని టపాలూ చదివేసాను. ఎందుకో నాకు మా అమ్మ మాట్లాడుతున్నట్టు అనిపించింది మీ చిన్నారి కి ప్రేమ లేఖ చదువుతుంటే. మీరు రాసే విధానం చలా నచ్చింది నాకు

    ReplyDelete
  2. ఒక్ఖ పిసరు అర్ధమైతే ఒట్టు. ఇంతకీ ఆ ఇంజనీర్లు ఏం చెప్పారో తెలిస్తే చెస్సొచ్చు కదా?

    చిన్న చిన్న విషయాలే నా బుర్రకెక్కవు. మరీ ఇంత బెద్ద బెద్ద వా !
    హతోస్మి ! అయితే, ఇదంతా ఆడ వారికి అనుకూలంగా చెప్పి ఉంటే మాత్రం నా ఓటు మీకేనండీ సుధారాణిీ గారూ ...

    ReplyDelete
  3. @ జోగారావు గారు,
    కొన్ని విషయాలు మాకర్ధం అయినట్లు మీకర్ధం కావు,అదే మా అదృష్టం,కొన్ని సార్లు మా దురదృష్టమూనూ!!!!

    ReplyDelete
  4. ఇది ఇంతకుముదు చూసానండీ, ఆ ఎవరో అసూయతో, బాడాయిలుపోతూ ఏవో చేస్తూ ఉంటారు. మనం పట్టించుకుంటామేమిటి అవన్నీను :)

    ReplyDelete
  5. సుధారాణిగారు,
    మీ వ్యాసం చదివేక ఆడవాళ్ళ మనసుకూ పసిఫిక్ మహా సముద్రానికీ లోతు కనుక్కోవడానికీ వున్నా సారూప్యమ్ కనిపించింది.. అయినా ఒక్క విషయం మాత్రం బాగా అర్ధమయ్యింది ఆఖరి చిత్రం చూస్తే- మా మొగవాళ్ళని అర్ధం చేసుకోవాలంటే ఒక్క బటన్ నొక్కితే సరిపోతుంది. కాని మీ ఆడవాళ్ళని అర్ధం చేసుకోవాలంటే ఏ బటన్ నొక్కాలో అర్ధం కాలేదు. బహుశా ఆ ఇంజనీర్ కి కూడా ఇదే అయోమయ పరిస్థితి వచ్చి ఉండి వుంటుంది!

    ReplyDelete
  6. డియర్ సుధా..
    అది చదివి కొద్ది సేపు బుర్ర గోక్కొని ఆలోచిస్తే అర్థం అయ్యింది..
    ఈ ఆడవాళ్ళూ మనకి ఎప్పటికి అర్థం కారని.
    అర్థం కాని అనవసరపు విషయాలకోసం ఎక్కువగా ఆలోచించ కూడదని...

    RAMANA BABAI.

    ReplyDelete
  7. akka blogs chadavadam ivaltiki kudirindi..anni bavunnayi.sahiti inti kooturivi anipinchukunnavu..pathavi kooda malli chadivanu.female brain meeda research chesnavadu great.aamatram bomma veyyagaligadante.kurrallaki nee jagartalu ,nee kavita chala bavunnayi.ee sari telugu lipi loo rastale..lekhini undiga naa lanti vari kosam.good keep it up.kalyani

    ReplyDelete
  8. వెంటాడే పదాలు...
    హాస్య చతురత నచ్చింది.....
    మీ శైలి బాగుంది....
    అరోగ్యకరమైన వంటకం,రుచిగా కూడా ఉంటే ఎవరిష్టపడరు చెప్పండి!!!

    ReplyDelete