13 May 2010

నేను.....



నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి రాకెట్లో నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యంతో మీరు.....

నిప్పులకొలిమిని పడి అత్తారింట్లో
నేనంతా పిడికెడు నివురై పోతే
నిమ్మకు నీరెత్తినట్టు మీరే......

(మహాకవి శ్రీశ్రీ ఆః కవిత ఆధారంగా)

9 comments:

  1. శ్రీ.శ్రీ కవితలో నింగికి నేనెగిరి పోతే అనే ఉంటుంది. రాకెట్లో అనే పదం ఎందుకో కొత్తగా వచ్చి చేరింది. దానికేం గానీ, పుట్టినదాదిగా వచ్చే ఆడవారి సమస్యలు అత్త వారింట్లోనే మొదలూ కావు ; ముగియనూ ముగియవు.
    అవివాహితలైన ఆడ పిల్లలని భయ పెట్టేదిగా ఉన్న ఈ కవిత లో చేసిన ఆరోపణ పాక్షిక సత్యమే నని నా అభిప్రాయం.

    ReplyDelete
  2. adbhutam...takkuva padalatho alochimpajese kavitha

    ReplyDelete
  3. @జోగారావుగారు,
    ఒక చిన్న సత్యాన్ని చూపుదామనే ప్రయత్నం తప్ప మరేం లేదు.
    మొదటి మాటలు కల్పనాచావ్లా లేదా సునీతా విలియమ్స్ ని దృష్టిలో పెట్టుకొని చెప్పినవి,,,తరువాతవి అత్తగారింట్లో వరకట్నపు దురాచారంలో సమిధలైన ఆడపిల్లలను గురించి చెప్పినవి...
    అవివాహితులైన ఆడపిల్లలను భయపెట్టడం నా ఉద్దేశం కాదు-
    ఆడవారి సమస్యల పట్ల సమాజ స్పందనను చూపించడం తప్ప.

    ReplyDelete
  4. కవిత గానే చూస్తె చాలా బాగుంది.

    ప్రస్తుతం వరకట్న " హత్యలు "( 80 -90 లలో కంటే ) బాగా తగ్గాయి.

    కాబట్టి సందోర్భోచితం గా లేదని పిస్తోంది.

    ReplyDelete
  5. సుధా
    చాలా బాగుంది కవిత. చిన్నదయినా, చీమ మిరపకాయ లాగ కారంగా వుంది.
    మీ కవితలో పోలిక నచ్చింది. రోదసిలో దూసుకెల్లినా అత్తవారింటికేల్లినా ఆఖరికి స్త్రీ బతుకు "మంట"కలవాల్సిందేనా? ఎంత సారూప్యం?
    అభినందనీయం.
    కోటేశ్వర రావు.

    ReplyDelete
  6. chala bagundi can i keep this in my blog

    ReplyDelete
  7. సుదా గారు మీరు కల్పనా చావ్లాను దృష్టిలో పెట్టుకొని రాసినా . పంతులు జోగారావు చెప్పినట్టుగా కొంత నెగిటివ్ భావన కలుగుతుంది. అలా అని అమ్మాయిల జీవితం అద్బుతంగా ఉందని చెప్పలేం, బాగా లేదని చెప్పలేం . మీ కవితపై ఆరుగురు అభిప్రాయలు చెబితే ఆరుగురి అభిపాయలు పరస్పర భిన్నంగా ఉన్నాయి. ౮౦-౯౦ లాలూ ఉన్నతు ఇప్పుడు వరకట్న హత్యలు లేవన్నారు ... కడుపులో ఆడ పిల్ల ఉందని తల్లిని పిల్లను చంపుతున్న మహాను భావుల వార్తలు చూస్తున్నాం కదండీ .. అలా అని ఆడవాళ్లే మంచి వారు మగ వారంతా చెడ్డ వారని చెప్పలేము. మనుషులంతా మంచివారైతే యెంత బాగుండు.

    ReplyDelete
  8. సుధా, మీ కవిత నాకు నచ్చింది

    ReplyDelete
  9. @మురళిగారు, మనుషులంతా మంచి వారైతే ఎంత బాగుండును. నిజమే.
    మంచి చెడ్డ కలిస్తేనే మనిషి అని పెద్దలు చెప్పిన మాటని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను.
    శ్రీశ్రీ గారి కవిత గుర్తొచ్చినప్పుడు ఎందుకో ఇలా అనిపించింది. ముందు చెప్పినట్టు
    స్త్రీ సమస్యల పట్ల సమాజంలో స్పందనని చూపించడం తప్ప....ఇందులో స్త్రీ వాదం ఏమీలేదు.
    @ సుజాత
    కవిత నచ్చింది....అన్న మొదటి వ్యక్తి మీరు...థాంక్స్.

    ReplyDelete