పేరు అసలు పేరు సరిగ్గా తెలియదు.
ముద్దు పేరు గిజిగాడు
వయసు సరిగ్గా తెలియదు
రంగు గోధుమరంగు,నలుపు,తెలుపుల కలగలుపు.
మా గిజిగాడు అతని స్నేహితులతో కలిసి ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితం
ఎ క్కడికో వెళ్ళిపోయాడు. అతను ఎప్పుడూ, గోధుమరంగు పైన అక్కడక్కడా
చారలుచారలు ఉండే బట్టలు ధరిస్తాడు.
ఇట్లు
గిజిగాడి ప్రేమికులు.ఎ క్కడికో వెళ్ళిపోయాడు. అతను ఎప్పుడూ, గోధుమరంగు పైన అక్కడక్కడా
చారలుచారలు ఉండే బట్టలు ధరిస్తాడు.
గుర్తింపు చిహ్నం మెడకింద భాగంలో ఉండే పెద్ద మచ్చ.
నగర జీవితంలో ఇమడలేక వెళ్ళి పోయాడు కనుక చిన్న చిన్న
పల్లెటూళ్లలో కనిపించే అవకాశం ఉంది.
చూసిన వాళ్లు దయచేసి ఈ చిరునామాలో సంప్రదించగలరునగర జీవితంలో ఇమడలేక వెళ్ళి పోయాడు కనుక చిన్న చిన్న
పల్లెటూళ్లలో కనిపించే అవకాశం ఉంది.
ఇట్లు
ప్రియమైన గిజీ...... నువ్వూ నీ స్నేహితులతో కలిసి కనిపించకుండా పోవడానికి కారణం ఈ మధ్యే
మాకు తెలిసింది.నువ్వు వెళ్ళాక కానీ మా జీవితాలలో నీ వెలితి ఎంత బాధిస్తుందో తెలియలేదు. నీ
జ్ఞాపకాలు మమ్మల్ని వేధిస్తున్నప్పుడు కానీ నీ ఉనికి మాకెంత సంతోషా న్నిచ్చిందో తెలియలేదు.
నీకోసం అమ్మ,నాన్న,అక్క,అన్నయ్య,చెల్లి , తమ్ముడు అందరూ నాతో పాటు ఎదురుచూస్తున్నారు.
నువ్వు మాకు చెప్పకుండా మాయమయిన దగ్గరనుంచి నీకోసం వెతక లేదని నీకు కోపం వచ్చిందా..
తలచుకుంటే నా కు కన్నీళ్ళాగడం లేదు. నువ్వింక కనిపించవేమోనన్న ఆలోచనతో నాకు నిద్రపట్టడంలేదు. ఏదో బెంగ మనసుని తొలిచేస్తోంది.
నీవు తిరిగి మాదగ్గరకు వచ్చేయవూ. మన ఇంట్లో పుట్టిన చిన్న పాపని నువ్వు చూడనే లేదు. దానికి నీ ఫొటో చూపిస్తే దాని జీవితంలో ఎప్పుడూ చూడని కొత్త బంధువుని చూసినట్టు ఎంత సరదా పడింది తెలుసా.ఎలా అయినా నిన్ను తీసుకురమ్మని రోజూ ఏడుస్తుంది.మాకు తెలిసింది.నువ్వు వెళ్ళాక కానీ మా జీవితాలలో నీ వెలితి ఎంత బాధిస్తుందో తెలియలేదు. నీ
జ్ఞాపకాలు మమ్మల్ని వేధిస్తున్నప్పుడు కానీ నీ ఉనికి మాకెంత సంతోషా న్నిచ్చిందో తెలియలేదు.
నీకోసం అమ్మ,నాన్న,అక్క,అన్నయ్య,చెల్లి , తమ్ముడు అందరూ నాతో పాటు ఎదురుచూస్తున్నారు.
నువ్వు మాకు చెప్పకుండా మాయమయిన దగ్గరనుంచి నీకోసం వెతక లేదని నీకు కోపం వచ్చిందా..
తలచుకుంటే నా కు కన్నీళ్ళాగడం లేదు. నువ్వింక కనిపించవేమోనన్న ఆలోచనతో నాకు నిద్రపట్టడంలేదు. ఏదో బెంగ మనసుని తొలిచేస్తోంది.
ఒకప్పుడు నువ్వు మా బాల్య స్నేహితుడవని పొద్దు పొడిచిన దగ్గరనుండి,ఊరు మాటు మణిగే వరకు మాతోనే ఉండేవాడివని తెలిసి అంత ఆత్మ బంధువుని, ఎలా వదిలిపెట్టావని, నిన్ను తీసుకురమ్మని రోజూ పోట్లాడుతోంది. నువ్వు,నీ భార్య, మా ఇంట్లోనే ఉండేవారని ,పిల్లలు మా కళ్ళముందే పెరిగి పెద్దయ్యారని రోజూ గుర్తుచేసుకుంటూనే ఉన్నాం. రెక్కలొచ్చిన నీ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో... మరి మా కంట ఎప్పుడూ పడనే లేదు.నువ్వైనా కలుసుకున్నావో లేదో.
ఆధునిక నగర జీవితంలో వచ్చిన మార్పులే మన ఇంట్లోనూ చోటుచేసుకున్నాయి. ఇల్లు మారిపోయింది. స్థలం అదే అయినా.నువ్వూ చూశావుగా. .మన పాత ఇల్లు విశాలంగా ఉండే పెద్ద ఇల్లు, ఎత్తయిన కప్పుతో, ఇంట్లోకి ధారాళంగా గాలి వెలుతురు ప్రసరించేవి.ఇంటిచుట్టూ తాతగారు పెంచిన జామచెట్టు, మామిడి,సపోటా చెట్లు ఉండేవి. శలవ రోజుల్లో వాటికి నేనోపక్క ఉయ్యాల వేసుకొని ఊగుతుంటే మరో పక్క నువ్వు, నన్ను చూస్తే భయపడి పారిపోయే నీ స్నేహితులు కొందరు ఉయ్యాలలూగేవారు. నీకేమో పొద్దున్నేలేవడం అలవాటు. నాకేమో ఒకంతట తెలివివచ్చేది కాదు. నీ కిల కిల నవ్వుల తోనే నాకు పొద్దు పొడిచేది. అమ్మ, బామ్మ అంటే నీకు ఇష్టం. వాళ్ళకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. నీకు ఏవి తినడానికి ఇష్టమో నాకు చెప్పింది వాళ్ళేగా. అవును గానీ నీకు పచ్చిబియ్యం, పప్పులు తినడం ఇష్టమేమిటి చెప్పు, నీ తిండి నా తిండి అలవాట్లు ఎప్పుడూ కలవవు. నీది ఒట్టి పిట్టతిండి.
నువ్వు ఓ ఇంటివాడివవడం కోసం కావలసిన ఏర్పాట్లు చెయ్యడం ఇంట్లో వాళ్ళందరికీ ఎంత సరదా.. తాతగారు ఇంటి కప్పు తిరగవేయించినప్పుడల్లా మీ ఇంటికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్పడం నాకెంతో గుర్తు.నువ్వు మీ ఆవిడని తీసుకురావడం, మీకు ఒకేసారి ఇద్దరు పిల్లలు పుట్టడం ఆ ముచ్చట్లన్నీ అందరం తలచుకుంటూ ఉంటాం.
ముఖ్యంగా ఓ రోజున ఇల్లుదాటి కదలొద్దని, జాగ్రత్తగా ఉండమని నువ్వు, మీ ఆవిడ పిల్లలని హెచ్చరించి బయటకు వెళ్ళారు. ఆరోజు పాపం పిల్లలు స్వేచ్ఛ దొరికింది కదా అని బయటకు వచ్చినట్టున్నారు. వెంటనే కింద పడ్డారు. అదృష్ట వశాత్తూ పెద్దగా దెబ్బలు తగలలేదనుకో. కానీ వాళ్ళని మేము చేరదీసినందుకు మీకెంత కోపం వచ్చింది. రెండు రోజులు వాళ్ళని ఇంట్లోకే రానీయలేదు. ఎలాగో నీ కోపం చల్లారి మళ్లీ రానిచ్చావు కానీ.
మరొక రోజు..... నువ్వు ఎప్పటిలాగే అటు ఇటు తిరుగుతూ హషారుగా ఉన్నావు. ఉక్కగా ఉందని ఫాన్ స్విచ్ వేసాను.నువ్వేమో ట్యూబ్లైట్ దగ్గర ఉండి ఏదో చేస్తున్నావు.
నువ్వు ఫాన్ దగ్గరకొచ్చావు .వెంటనే నేను స్విచ్ ఆపాను కానీ ఫాన్ నీకు తగలనే తగిలింది. నీ చెయ్య విరిగిపోయిందనే అనుకున్నాం ఆరోజు. అందరూ నన్ను హంతకురాలిలా చూడడం, నేను సిగ్గుతో తలవాల్చుకోవడం నాకు బాగా గుర్తుంది.
రోజు రాత్రి చదువుకుంటున్నప్పడు నీకు లైట్ ఉంటే చికాకని తెలిసినా నేను ట్యూబ్లైట్ వేసుకొని చదివేదాన్ని. పాపం నువ్వెప్పుడూ వద్దనలేదు. పైగా నిద్రపట్టేయకుండా ఉండడానికి నన్ను పలకరిస్తూనే ఉండేవాళ్ళు, నువ్వు, మీ ఆవిడ. మీ ఇద్దరు మేల్కొని ఉంటే పిల్లలెక్కడ పడుకుంటారు. వాళ్ళకి ఏదో ఒకటి పెడుతూ ఉండడం తోనే సరిపోయింది మీ ఇద్దరికీ.
పిల్లలు వాళ్ళంతట వాళ్ళు పైకి రావడానికి,స్వతంత్రంగా జీవించడానికి నువ్వు మీ ఆవిడ ఎంత కష్టపడ్డారో మేము చూసేంగా.సరే .... ఆ తర్వాత నువ్వు ఆవిడ దూరంగా ఉన్నారని, మళ్లీ కలుసుకోనే లేదని అనుకుంటున్నాం.
నాకుద్యోగం వచ్చి దూరంగా వెళ్ళిపోవడం, బతుకుపోరాటంలో దూరభారాలకు ప్రయాణాలు, అనారోగ్యాలు ఇలా ఎన్నో కారణాలతో నా చిన్ననాటి స్నేహితుడిని మర్చిపోయాను సుమా. ఒకనాడు ఇంటికి ఫోన్ చేసి అడిగాను,నువ్వింకా మా ఇంట్లోనే ఉన్నావనుకొ ని. కానీ వాళ్ళెవరూ చాలా కాలంగా నిన్ను చూడనేలేదన్నారు. నీ స్నేహితులుకూడా చాలా అరుదుగా కనిపిస్తున్నారని చెప్పారు. ఆఖరుసారిగా నిన్ను ఎప్పడు చూశానో నాతో పాటు ఎవరికీ గుర్తులేదుట.
ఇక నిన్ను వెదికే ప్రయత్నాలు ప్రారంభించాను...
నువ్వు కనిపించకపోవడానికి కారణాలు ఏమయి ఉంటాయని ఆరా లు తియ్యడం ప్రారంభించాను. కొందరి సలహా మేరకు ఇంటర్నెట్ లో వెతికాను. నీగురించి నేను వెతికినట్టే , నీ స్నేహితులు చాలా మంది కూడా వెతుకుతున్నారు. వాళ్ళు నీగురించి నాకన్నా ఎక్కువే వెతికి, చాలా చాలా విషయాలు చెప్పారు. ఆ విషయాలు తెలుసుకుని మేము పొందిన ఆశ్చర్యానికి అంతులేదు.
ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ఫలంగా మాకు దొరికింది సెల్ ఫోన్. మేము ఒక్కక్షణం కూడా విడిచి ఉండలేని బంధంగా తయారై మాజీవితాలతో పెనవేసుకున్న మా సెల్ ఫోన్.... మేము దాన్ని వాడడం నీకు ప్రాణాంతకంగా ఉందిట. ఆ శబ్దాల బాధని భరించలేక దూరంగా వెళ్ళిపోయావుట.
అమ్మ,బామ్మ పచారీ సామాన్ల వాడుక మానేసి కొ త్త కొత్త సూపర్ బజార్లలో అమ్ముతున్న శ్రేష్టమైన సరుకులు కొని పప్పు బియ్యం బాగుచేసుకొనడం మానేయడం మరోకటి ట.
ముఖ్యంగా మా పాత ఇల్లు మార్చేసి పదిమంది కలిసి ఉండేలా అపార్టు మెంట్లు కట్టుకోవడం వల్ల నీకు నిలువనీడ లేకుండా పోయిందిట. మా ఇంటికీ నీ ఇంటికీ సంబంధం ఏమిటీ అంటే చాలా ఆసక్తికరమయిన విషయాలే చెప్పారు వాళ్ళు. మన పెరట్లో పూర్వం గడ్డీ,గాదం, చెట్టూ,చేమ అన్నీ ఉండేవి కదా. అపార్టుమెంటు కట్టాక చుట్టూ బండలు పరిపించి శుభ్రంగా చేయించుకున్నాం , మట్టి,మశానం అన్నీ అంటకుండా. అదీ నీకు నచ్చలేదుట.
మరీ అన్యాయంగా అనిపించిన మరో విషయం ఏమిటి తెలుసా.... మేము కుండీల్లో మొక్కలు పెంచుకుంటూ, వాటికోసం మంచి మంచి ఎరువులువేసి గుత్తులుగా పూలు పూయించుకోవడం కూడా నీకు ఇష్టంలేదుట. మేము ఉపయోగిస్తున్న పద్ధతుల వల్ల మా చెట్లన్నీ పచ్చగా ఉన్నాయనుకుంటున్నాం గానీ,నీ నోట్లో మన్ను కొట్టామట. నీవన్నీ సాంప్రదాయిక మైన పద్ధతులు కాబోలు. మాకేం తెలుసు చెప్పు.....
కర్ణుడి చావుకు పదివేల కారణాలన్నట్టు నువ్వు కనిపించక పోవడానికి కారణం ఏమిటా అని వెతికితే వెలుగు చూసిన కారణాలు ఇవి.
ఏది ఏమయినా కాని, నువ్వు మమ్మల్ని వదిలిపోతావనుకుంటే మేము జాగ్రత్త పడేవాళ్ళమేమో...మాకేం తెలుసు నీకు మా పనులు అంత కష్టంగా తోస్తాయని..
నాకు గానీ,ఇంట్లో ఎవరికీ గాని తీరిక లేని పనులతో సతమతమయ్యి వెతకలేదు కానీ నాకో అనుమానం ఉంది....కొండ కోనల మధ్య ప్రశాంతంగా ఉండే మన పల్లెటూరు లోనే నువ్వు ఉండి ఉంటావని...అక్కడైతే ఉండడానికి గూడు,తినడానికి తిండి,తాగడానికి శుభ్రంగా ఉండే నీళ్లు అన్నీ నీకు హాయిగా దొరుకుతాయి. ముఖ్యంగా కాలుష్య రాక్షసి నీ ఆరోగ్యాన్ని కొరుక్కు తినదు.... అవును... నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ పల్లెలే సరిఅయిన ప్రదేశాలు. అక్కడే ఉండి ఉంటావు.....
నువ్వు ఉన్నచోటే నా కాపురం పెడతాను. ఈ శబ్ద కాలుష్యం నన్ను కాటువేయకముందే నేను నిన్ను వెతుక్కుంటూ వస్తాను..... నా చిన్నారి నేస్తం.... నాకోసం అక్కడే ఉంటావు కదూ......
mee giji gaadu maa vuri lo unnadu.. vaste chupistanu.. veelu ledani ante giji gadi meeda prema lenatle.. veelu chesukuni chinni papani teesukuni vaste giji gadini valla manamallani chupistanu..maa vuru neeku telusaa? srikakulam antaru..peedavadi vuti antarule.. anduke mee giji gadu ikkada kapuram pettesadu pilla papalto.. vastara mari tondara lo...
ReplyDeletesarada lakshman
hi akka ...hmmm adbhutamaina concept..nostalgia ..emaipoyayi aa rojulu..how green was my valley ..annattu!..mana yantrika jeevitalalo padi ennenni sangatulu santoshalu marachipotunnamo kada ..ippatike maa peddodu avuni choosi barrelni choosi ado dinosaurni choosinattu feel avutunnadu..asalu meekalanevi choose avakasamkooda vadiki ledu..inkonnallaki manushule tappa mareeevi migalaveemo...keep it up ..kallallo neellu teppinchadu mee gijigadu...bye.
ReplyDeleteబ్లాగ్మిత్రులారా ఈ పోస్టును దయచేసి చదవండి చాలా ముఖ్యమైన విషయం చెపుతున్నారు. ఈ బ్లాగరి.
ReplyDeleteసుధారాణి గారు
చాలా అద్బుతంగా వ్రాసారండీ.
ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని అనుభవాలు పిచ్చుకలతో
చాలా చక్కగా సార్వజనీజం చేసారు మీ అనుభవాలను.
గొప్ప నేరేషను.
promise, i was spell bound. being a zoology lecturer i am also conscious of all the facts you provided.
ఈ మధ్యనే ఏదో బ్లాగులో కామెంటాను, పిచ్చుకలపై కవిత వ్రాయాలని ఉన్నది, ఫాల్ ఆఫ్ స్పారో పేరుతో,అని, అదింకా అసంపూర్తిగానే ఉంది.
మీ పోస్టు చదివాకా ఆకవిత చాలా చిన్నదిగా, అసమగ్రంగా అనిపిస్తోంది.
చాలా చాలా బాగా వ్రాసారు. ఇది ఇంకా పదిమందికి తెలియాలి. కవితంటూ వ్రాస్తే మీ పోస్టుని లింకుగా వాడుకొంటాను. అభ్యంతరం లేదుగా.
ఇప్పుడు మనం చేయగలిగింది
1. వీలైతే వరికంకులతో కుచ్చులు మన ఇళ్ళల్లో పెట్టుకోవటం, 2. అపార్ట్ మెంట్లలో ఉండే వారు చిన్న చిన్న అట్ట పెట్టెలలో గడ్డి వేసి కొంచెం ఎత్తులో బయటకు దారి ఉండేలా కొంత మేతతో వేలాడదీయటం,
వంటి సలహాలు మంచి ఫలితాలనిస్తున్నాయని చదివాను.
పల్లెటూర్లనుంచి వచ్చే మా విధ్యార్ధులకు చెప్పి చేయిస్తున్నాను.
మా అపార్ట్మెంట్లో పెట్టాం కానీ రాలేదు చాలా నెలలు అలాగే ఉంచాం ఫలితం లేదు.
any suggestions. please.
అభినందనలతో
బొల్లోజు బాబా
అద్భుతం అని ఒక చిన్నమాటలో చెప్పలేనుగాని,ఈమధ్యకాలంలో ఇంతగొప్పబ్లాగుటపా నేను మాత్రం చదవలేదు.
ReplyDeleteఅందుకే మీ అనుమతి తీసుకోకుండానే మా
http://vizagdaily.co.cc/ లో మరలా ప్రచురిస్తున్నా.]
ఖంగారుఖ్హంగారుగా వందలవందల బ్లాగుటపాలు రాయక్కర్లేదండి,ఇలాంటివి అరుదుగా వచ్చినా కలకాలం నిలిచిపోతాయి చరిత్రలో
బొల్లోజు బాబాగారు,
ReplyDeleteనా ఆవేదనని అర్థంచేసుకున్నందుకు ధన్యవాదాలు.ఏదైనా పోగొట్టుకున్నప్పుడు కాని దానివిలువ,మనసుతో ముడిపడిన బంధం తెలీవంటారు. పిచ్చుకల విషయంలో అదే జరిగింది. మీరు చెప్పినట్టు చిన్న చిన్న గూళ్లు తయారుచేసి పెట్టడం చాలాసార్లు జరిగింది. కానీ రావడానికి అసలంటూ ఉంటేగా... ఎలా తీసుకురావడం.పల్లెసీమలన్నీ పట్టణరూపం సంతరించుకుంటున్న నేపథ్యంలో పిచ్చుకలను మళ్ళీ చూడగలుగుతానన్న నమ్మకం సన్నగిల్లిపోయింది.
నా టపాను లింకుగా వాడుకుంటే అభ్యంతరం ఎంతమాత్రమూ లేదు.
రాజేంద్రకుమార్ గారూ,
ReplyDeleteనా టపాని మెచ్చుకున్నందుకు,చరిత్రలో నిలిచిపోతుందన్నంత గొప్ప మాట వాడినందుకు మరీ మరీ
ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
మీ సైట్ లో నా టపాని ఎప్పుడు ఉంచబోతున్నారు...ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
చాలా అద్బుతంగా వ్రాసారండీ.
ReplyDelete:)
రాజేంద్ర గారితో నేను ఏకీభవిస్తున్నాు. అభినందలు.
ReplyDeleteఅమ్మాయి సుధారాణీ,
ReplyDeleteనీకు నా ఆశీస్సులు. నేనొక పదవీవిరమణ చేసిన తెలుగు పండితుణ్ణి. నువ్వు కచ్చితంగా నాకంటే వయస్సులో చిన్నదానివే అనుకుంటున్నాను. అందుకే ఆశీస్సులన్నాను. ఏకవచనప్రయోగానికి ఏమీ అనుకోవు కదా.
నువ్వు గిజిగాడు అని పేర్కొని ఊరపిచ్చుక గురించి వ్రాసింది చదివాను. ఎంత బాగుంది? ఎన్నెన్ని జ్ఞాపకాలు? మళ్ళీ ఒక్కసారి నా బాల్యం నన్ను పలకరించింది. ఆ పిచ్చుకలు, వాటి అల్లరి, గుమ్మాలకు కట్టే వరికుచ్చులు అన్నీ గుర్తుకు తెచ్చావు. నీకు నా ధన్యవాదాలు.
ఇక్కడ నా జీవితంలో జరిగిన ఒక సంఘటనను మీకు చెప్పాలనిపించింది. దాదాపు 30 ఏళ్ళ క్రితం మేమొక ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం. ఆ ఇంట్లో ఒక పిచ్చుకల జంట ఉండేది. మా ఆవిడ "రేడియో పాటలు విననీయకుండ వీటి గోల ఏమిటి?" అని విసుక్కొనేది. నేను మాత్రం మా ఆవిడ చూడకుండ ఆ పిచ్చుకల జంటకు ధాన్యం వేసేవాడిని.
ఒకసారి మేము మా ఇంటికి తాళం వేసి గోదావరిఖనిలో ఉన్న మా బావమరది ఇంటికి వెళ్ళాము. ఇంట్లో ఉన్న పిచ్చుకల గురించిన ఆలోచనే రాలేదు. మేమక్కడ నాలుగు రోజులుండి తిరిగి వచ్చాము. ఇంటి తాళం తీస్తుంటే ఒక పిచ్చుక విపరీతంగా గోల చేయసాగింది. మేమంతగా పట్టించుకోలేదు. తాళం తీసి లోపలకు అడుగు పెట్టగానే లోపల ఒక పిచ్చుక నేలమీద ముడుచుకొని దీనంగా కూర్చొని కనిపించింది. మాతో పాటు బయటినుండి లోనికి వచ్చిన పిచ్చుక దాని చుట్టూ తిరుగుతూ గోల చేయ సాగింది. దానిని చూడగానే ఇంట్లో ఉన్న పిచ్చుకకు ప్రాణం లేచివచ్చినట్లయింది. ఆ రెండూ బయటకు వెళ్ళిపోయాయి. మళ్ళీ అవి మా ఇంట్లోకి రాలేదు.
జరిగిందేమిటంటే మేము ఇంటికి తాళం వేసినప్పుడు ఆడ పిచ్చుక ఇంట్లో, మగ పిచ్చుక బయట ఉండిపోయాయి. నాలుగు రోజుల ఎడబాటు వాటిని ఎంత బాధ పెట్టిందో. అవి మళ్ళీ కలుసుకొన్నప్పుడు ఎంత ఆనందిచాయో ఇప్పటికీ గుర్తుకు వస్తుంది.
నీ రచన చాలా బాగుంది. ధన్యవాదాలు.
' వెన్సీ ' గారూ!
ReplyDelete" కనబడుట లేదు " శీర్షికన మీ రచన చాలా ఆలస్యంగా ఈ రోజే చూశాను.
అంతరించిపోతున్న ఊరపిచ్చుక గురించిన మీ భావాత్మక ఆందోళనలో పాలు పంచుకోలేకుండా ఎవరూ ఉండలేరు. అయితే ఒక విషయం మాత్రం మీరు తెలుసుకుని ఉంటే బాగుండేది. " గిజిగాడు " , " ఊరపిచ్చుక " ఒక్కటే అని మీరు పొరబడినట్లున్నారు. ఎంతమాత్రం కాదు. గిజిగాడు అంటే మ ఇళ్ళల్లో గూడు కట్టుకునే పిచ్చుక కాదు. గిజిగాడు ఊరి పరిసరాల్లో చెరువులూ , దొరవులూ, బావులూ, కుంటల సమీపాల్లో ఈతచెట్లపై, నల్ల తుమ్మచెట్లపై అందంగా గూళ్ళు అల్లుకుంటాయి. ఊరపిచ్చుకలు పూరిళ్ళలో, బోద( రెల్లు) కొట్టాల్లో , ఆవాసం పొందుతూ మన మధ్యనే తిరుగుతూ ఉంటాయి. మానవ సమాజంతో ఊరపిచ్చుకల మనుగడ ముడిపడి ఉంది. ఈ రెండు పిచ్చుకల జాతులు (శాస్త్రీయంగా -కుటుంబాలు) వేరు వేరు! గిజిగాడిని ఇంగ్లీషులో వీవర్ బర్డ్ అనీ , Baya Ploceus Baya అనీ అంటారు. గిజిగాడు Plociedae కుటుంబానికి చెందిన పక్షి.. దీనిని మన తెలుగు నాట కొన్ని చోట్ల పసుపు పిట్ట, పచ్చ పిట్ట అని కూడా అంటారు. మీరు ఫోటోతో పాటుగా రాసింది ఊరపిచ్చుక గురించి . ఊరపిచ్చుకను house sparrow అంటారనే విషయం అందరికీ తెలిసిందే!
శ్రీ ఓబుల్ రెడ్డి గారికి,
ReplyDeleteమీరు నా రచన చదివి వ్యాఖ్య ఉంచినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు.మీరు చెప్పిన విషయాలు చాలా వివరణాత్మకంగా ఉన్నాయి. అయితే ఊరపిచ్చుక,గిజిగాడు రెండు విభిన్న జాతులకు చెందిన పక్షులని మీరు చెప్పిన విషయం నాకు అవగాహన ఉంది. రచనలో గోప్యత కోసం ఆ గిజి అన్న పేరును నేను వాడుకున్నాను. ప్రియమైన ఊరపిచ్చుకా అని సంబోధించడం లో కన్నా ప్రియమైన గిజీ అనడం వల్ల అది వ్యక్తి పేరేమో అన్న ఆసక్తి కలిగించడం నా ఉద్దేశం.
మీరు ఇంత శ్రద్ధగా శ్రమ తీసుకొని వివరించినందుకు నెనర్లు.
దొంగలు చచ్చిన ఆరు నెలలకి ఏమిటీ గోల-అని అనుకోనట్లయితే ముందుకు సాగండి:
ReplyDeleteఈ మధ్యనే గిజిగాళ్ళ హడావిడి కొంత హైదరాబాద్ లో చూసేను. చెప్పొద్ధూ, చాలా సంతోషం వేసింది. నూలుపొగులాగ అయిపోయాడనుకున్నాను. కొంచెం లోతుగా ఆలోచిస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్టున్నామా అనిపిస్తోంది.
పర్యావరణం గురించి ఎంత గొంతు చించుకుని అరిచినా ప్రయోజనం లేదు అనిపిస్తోంది. మనిషికి ఎంతసేపూ తన కుటుంబం గోల తప్ప మనలాంటి వాళ్ళ గురించి కూడా పట్టించుకోడు, ఇక గిజిగాడిలాంటి వాళ్ళ గురించి ఎందుకు లక్ష్య పెడతాడు?
ఇంత చక్కగా గిజిగాడి గురించి రాసినందుకు మీకు వెయ్యాలి రెండు వీరతాళ్ళు!!!
కోటీశ్వర రావు
మీరు గిజిగాడు పట్ల చూపిన అనురాగం చదువుతుంటే కళ్ళు చెమర్చాయి. ఇప్పుడు పల్లెల్లో కూడా కనబడడం లేదండీ. ఎక్కడికక్కడ బ్రహ్మజెముడు ముళ్ళలా పుట్టుకొచ్చిన సెల్ టవర్ల రేడియేషన్ ప్రభావం, రసాయనిక ఎరువుల వాడకం, కాలుష్యం వలన మనకు ఓ జ్నాపకంగా మిగిలిపోతున్నాయి. వాటినే కోల్పోతున్నాం తప్ప మనకేమీ కాదులే అన్న భ్రమలో అందరం వున్నాం. ఈ పోయేకాలం మనకూ దాపురిస్తుందన్న స్ఫృహ లేకుండా వున్నవాళ్ళం. మీ స్పందనకు ధన్యవాదాలు..
ReplyDeleteనా చిన్నారి నేస్తం....గురించి ఎంత బాగా రాసారు సుధా ...మన కోసం తప్పకుండ వచేస్తుంది ఈ మధ్య మా ఇంట్లో గూడు పెట్టుకుని పిల్లలు పెట్టుకుంది ఈసారి వస్తే మీ గురించి చెప్పి పంపిస్తాను
ReplyDelete