29 January 2011

ఓ మంచి బ్లాగు.....కనుగొంటినీ...

ఓమంచి బ్లాగు అనగానే క్లిక్ చేసి ఇక్కడికి వచ్చారు కదూ. మీ బ్లాగు పేరు ఉంటుందని చూస్తున్నారా.
అమ్మ దొంగా... తెలీదనుకోకండి.
నేనూ అలాంటి  టైటిల్స్ పెట్టిన బ్లాగుల్లోకి వెళ్ళి నా బ్లాగు పేరు ఉంటుందేమోనని వెతుక్కొని వచ్చిన అనుభవం పొందానండోయ్.
కానీ సారీ....మీరెవరూ ఇంతవరకూ చూసి ఉండని బ్లాగేనని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ బ్లాగులో బోల్డు పోస్టులున్నాయి కానీ ఒక్క దానికంటే ఒక్కదానికైనా ఒక్క కామెంటూ  లేదు కాబట్టి.
తెలుగు బ్లాగుల సంకలినులు వేటిలోను ఆయన టపాలు నేను  చూడలేదు.
ఇంతకీ ఆ బ్లాగు పేరు వైద్యరత్నాకరం.
ఆ బ్లాగును  నిర్వహిస్తున్నవారు  శ్రీ శేషగిరిరావు వందన గారు. ఆయన వృత్తిరీత్యా డాక్టరు. శ్రీకాకుళంనుంచి ఆయన ఈ బ్లాగును నిర్వహిస్తున్నారు. ఈ బ్లాగులో చాలా టపాలు ఉన్నాయి.
వైద్యపరమయిన విషయాలకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ ఆయన రాసిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. శాస్త్రసంబంధమయిన విషయాలను అందరికీ అర్థం అయేలా రాయగలగడం అంత తేలికేం కాదు కదా.
చదివించే చక్కని శైలి ఉంది ఆయన రచనావిధానంలో.
some common medical problems and solutions in Telugu Language అంటూ తెలుగులో వైద్యవిజ్ఞానాన్ని అందించడం ఈ బ్లాగు ఉద్దేశంగా కనిపిస్తోంది. ఆరోగ్యం విషయంలో  రకరకాల  సందేహాలు, అనుమానాలు మనకి మామాలే.  ఈ బ్లాగులో అలాంటి సందేహాలను నివృత్తి చేసేవిధంగా ఉన్న టపాలు చాలా ఉన్నాయి. అయితే ఇంతవరకు కామెంట్స్ లేవు కాబట్టి మనకు కలిగే సందేహాలకు పత్రికలలో వచ్చే ప్రశ్న- జవాబు శీర్షికలో లాగ డాక్టరు గారు జవాబులు చెప్తారో లేదో తెలీదు మరి.
తెలుగులో వైద్యవిషయాలకు సంబంధించి ఆయుర్వేద వైద్యవిధానాలు చెప్పే బ్లాగులు కొన్ని ఉన్నట్టున్నాయి. కానీ ఇంగ్లీషువైద్యంలో ఆరోగ్యం గురించి, ఆచరించవలసిన విధానాలగురించి పరిచయం చేస్తున్న మంచి బ్లాగు ఇది.
ఒకటా రెండా అబ్బో ఎన్ని విషయాలపై గురించి రాసారో....
శ్రీకాకుళంలో వందన(విజయలక్ష్మి)నర్సింగ్ హోమ్ పేరున ఆస్పత్రిని నిర్వహిస్తున్నారని, ఇద్దరు పిల్లలు కూడా డాక్టర్లేనని ఆయన వెబ్ సైట్ లో రాసారు. ఈ వెబ్ సైట్ ఇంకా నిర్మాణదశలో ఉన్నట్టుంది. పోస్టులేం లేవు. కానీ ఆ విభాగాల పేర్లు చూస్తే చాలావిషయాలనే రాయదలచుకున్నట్టు ఉంది.
వృత్తిరీత్యా ఎంతో బిజీగా ఉంటూ కుటుంబానికే సమయం కేటాయించలేక సతమతమయ్యే డాక్టరు వృత్తిలో ఉండి సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో తెలుగులో ఇలా బ్లాగు ప్రారంభించడమే కాక చదివించే లక్షణం గల చక్కని  రచనలు చేస్తున్న డాక్టరుగారికి అభినందనలు తెలుపుతూ ఈ టపా.
వీలయితే మీరు కూడా ఇక్కడ ఓ క్లిక్కేసుకొని, అక్కడ ఓ లుక్కేసుకోండి.
నచ్చిన చోట కామెంటేసుకోండి.

8 comments:

 1. ధన్యవాదాలండి!
  అందరిలా నాకెందుకులే అనుకోకుండా ఒక చక్కని బ్లాగ్ ను పరిచయం చేసారు.
  చిన్న చిన్న ఆరోగ్య సలహాలకు వైద్యుల వద్దకు వెళ్ళలేం అలాంటి వాటికి చక్కని ప్రత్యామ్నాయం గా ఈ బ్లాగ్ ను సూచించిన మీకు నా కృతఙ్ఞతలు.

  ReplyDelete
 2. నిజంగా చాలా మంచి బ్లాగండోయ్ .. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు :-)

  ReplyDelete
 3. manchi blog parichayam chesaarandee....dhanyavaadaalu

  ReplyDelete
 4. డాక్టర్ వందన శేషగిరిరావు శ్రీకాకుళంలోపొపులర్ డాక్టర్.అయన krishi గురించి నాకు తెలుసును.అందరికి పరిచయం చేసినందుకు అభినందనలు. రమణారావు .muddu

  ReplyDelete
 5. ధన్యవాదాలండీ . ఇంత మంచి బ్లాగుని మీరు ఎలా కని పెట్టారండీ? ఏ సంకలినిలోనూ లేని ఈ బ్లాగు వివరాలు మీకెలా తెలిసాయి? సరే లెండి. ఏమయినా, ఎంతో ఉపయుక్తమయిన చక్కని బ్లాగుని మాకు పరిచయం చేసారు.

  ReplyDelete
 6. ఆ బ్లాగుని సంకలినులు జత చేస్తే బావుంటుంది. ఇలా ఎంకెన్ని మంచి బ్లాగులు సంకలినులు వున్నాయని తెలియక తెరమరుగుగా వున్నాయో.

  ReplyDelete
 7. ఈ టపాకి స్పందించిన అందరికీ ధన్యవాదాలు.
  పైన వ్యాఖ్యను రాసిన శ్రీ ముద్దు రమణారావుగారు కూడా శ్రీకాకుళానికి చెందిన నేత్రవైద్యులు. శ్రీ రమణారావుగారు. విశ్రాంతి తీసుకోవలసిన వయసులో అవిశ్రాంతంగా చేస్తున్న అపురూపమైన సాహితీ సేద్యాన్ని వివరిస్తూ శ్రీ పంతుల జోగారావుగారు పరిచయంగా రాసిన టపాని ఇక్కడ చూడవచ్చు.http://kathamanjari.blogspot.com/2010/08/blog-post_2598.html.
  రమణరావుగారూ, ధన్యవాదాలు.

  ReplyDelete
 8. manchi blog ni parichayam chesinamduku thanks andi.yintaki docter gari salahalu ni podalamte a blog ni visit cheyallo cheppagalara.

  ReplyDelete