"ఇదిగో ఇదిగో..........ఇటు చూడు..
ఎవరో నిన్నే పిలిచేరూ....
ఇదిగోఇదిగో.......ఇటుచూడూ..."
ఎంత మంచి పాటో......డ్యూయెట్స్ లో బెస్ట్ సాంగ్స్ లో ఇదోకటి....ఎంత బావుంటుందో!
ఏమిటీ ...పాటతో పాటే మాటలా వినబడుతోందే....!
ఎవరూ.......? ఎవరదీ....?
" ఇటు చూద్దూ....అబ్బ...కొంచెం సేపు ఆ టైపింగ్ ఆపి నేన్చెప్పేది వింటావూ...?"
"ఎవరూ? అక్కడ మాట్లాడుతున్నదీ.....?"
"నేనే...! ఇదిగో ఇక్కడ....అద్దం లోంచి....నేనే.!"
" ఓహో! నువ్వా?....సినిమాలో తెల్లాత్మలా! ఎందుకూ ఇప్పుడొచ్చావ్?"
" ............. అదే మరీ...."
" ............. అదే మరీ...."
" నేనేమంత కాని పని చేస్తున్నాననీ.
మంచి పాటలు వింటూ....హాయిగా రాసుకుంటూ ఉంటే...నీకేం పనొచ్చిందీ నాతో.? "
" అవునుమరి ...రోజూ నాకు నీతో మాట్లాడాలని ఉంటుంది..ఒక్కనాడూ నావేపు చూడవు.
నాతో మాట్లాడ్డం కూడా మానేసావ్...నేను ఏం చెప్పినా పెడచెవిన పెడుతున్నావ్...
అసలు నా మాట నీకు వినబడుతోందా ? అని సందేహంతో తటపటాయిస్తూ ఉన్నా...."
నాతో మాట్లాడ్డం కూడా మానేసావ్...నేను ఏం చెప్పినా పెడచెవిన పెడుతున్నావ్...
అసలు నా మాట నీకు వినబడుతోందా ? అని సందేహంతో తటపటాయిస్తూ ఉన్నా...."
"సరేలే...వింటున్నాగా..చెప్పూ...చెప్పవమ్మా...చెప్పూ..."
అసలే టైమ్ లేదు...అవతల నెట్లో చాటింగ్ చేస్తున్నానా...నా సమాధానం కోసం అక్కడ వెయిటింగూ....!"
" అదే ...దాని గురించి మాట్లాడదామనే....నీకిప్పుడది అవసరమా...? "
" అబ్బా..నస ఆపి చెప్పదల్చుకున్నది చెప్పిపోవచ్చుగా...!"
" ఇప్పుడు ఆ చాటింగ్ ఎందుకూ అని ! అవతల మనిషి ఎవరో వివరాలు తెలీవు..ఎలాంటి వారో సమాచారం తెలీదు. నువ్విచ్చే వివరాలు ఎలా ఉపయోగిస్తారో తెలీదు...ఇన్ని తెలీనప్పుడు ఆ సంభాషణం ఎందుకూ...అని ! "
"చాల్లే...వేసిన ప్రశ్నలే వేస్తూ ఉంటావు. ఇంత చదువుకున్నదాన్ని, నా అంతట నేనే ఇన్ని టెక్నికల్ విషయాలు తెలుసుకోగలిగిన దాన్ని, ఆమాత్రం జాగర్త నాకు లేదంటావా ?"
"నేనెవరో వివరాలు ఇస్తున్నానా... ఇక్కడ నా పేరూ, నా ఊరూ, నా ఫోన్ నెంబరూ అన్నీ డూపే తెలుసా... డూపు అనకూడదనుకో. ఈ భాషలో ఫేక్ అనాలి. తెలుసుకో.
"నేనెవరో వివరాలు ఇస్తున్నానా... ఇక్కడ నా పేరూ, నా ఊరూ, నా ఫోన్ నెంబరూ అన్నీ డూపే తెలుసా... డూపు అనకూడదనుకో. ఈ భాషలో ఫేక్ అనాలి. తెలుసుకో.
అప్పలమ్మపేరు కూడా అపరాజిత అయిపోతుంది... ఇక్కడ. అమలాపురం రూరల్ లో ఉన్నా..అమెరికాలో ఉన్నామని చెప్పి బిల్డప్ ఇచ్చి కబుర్లు చెప్పుకోవచ్చు. నీకేం తెలుసుగనుక !!
మరి నాకేం సమస్యలు వస్తాయని నీ హెచ్చరికలు....?!"
" ఫో...చికాగ్గా ఉంది....!! "
మరి నాకేం సమస్యలు వస్తాయని నీ హెచ్చరికలు....?!"
" ఫో...చికాగ్గా ఉంది....!! "
**** **** ***** *****
"ఇదిగో నిన్నే....!!"
మళ్లీ వచ్చావూ...ఆపని మీదే అయితే తక్షణం వెనక్కి వెళ్ళిపో.... చాలా సమస్యగా ఉంది నీతో...మంచి మూడ్ కాస్తా చెడగొడుతూ తగుదునమ్మా అని తయారవుతావు.
చూసావా...నేను రాసిన టపాలకి, నేను రాసిన కామెంట్లకి ఎన్ని చప్పట్లు వచ్చాయో.. ఊరికే నన్ను హెచ్చరించడమే పనిగా పెట్టుకున్నావ్. చాలు...
అయినా నేనేం తప్పు చేసాను మహా...నా పనులు పూర్తిచేసుకొని అందరికీ అన్నీ అమర్చే కదా ఇక్కడికొస్తాను. హాయిగా పాటలు వింటాను. కథలు,నవలలు ఏది కావలిస్తే అది చదువుతాను, వంటల్లో సందేహాలుంటే తెలుసుకుంటాను. తోచినప్పుడల్లా కథలు రాసుకుంటాను.
అయినా నేనేం తప్పు చేసాను మహా...నా పనులు పూర్తిచేసుకొని అందరికీ అన్నీ అమర్చే కదా ఇక్కడికొస్తాను. హాయిగా పాటలు వింటాను. కథలు,నవలలు ఏది కావలిస్తే అది చదువుతాను, వంటల్లో సందేహాలుంటే తెలుసుకుంటాను. తోచినప్పుడల్లా కథలు రాసుకుంటాను.
ఎంత కష్టపడి నేర్చుకున్నాను...ఈ విషయాలన్నీ. ఏ కోర్సులకీ వెళ్ళగలిగే శక్తి లేకున్నా స్వంతంగా తెలుసుకొని దీన్ని వాడడం నేర్చుకున్నానా. అసలు ఎంత మహాద్భుతం ఇది! ఒకసారి ఇంటర్నెట్ లోకి గానీ వెళ్ళగలిగామా...అది చూపే అద్భుతాలు వర్ణించడానికి ఎవడితరం...
ఎవరి సంగతో నాకెందుకు. నావరకు నేను నిర్మించుకున్న సుందర సామ్రాజ్యం అంతా ఇందులోనే ఉంది.
ఈ కంప్యూటర్ పార్టులే నా ప్రజలు. ఈ మౌసే నా మంత్రి...నేనేం చెయ్యమంటే అవి చేస్తారు వీళ్ళు.
ఎవరి సంగతో నాకెందుకు. నావరకు నేను నిర్మించుకున్న సుందర సామ్రాజ్యం అంతా ఇందులోనే ఉంది.
ఈ కంప్యూటర్ పార్టులే నా ప్రజలు. ఈ మౌసే నా మంత్రి...నేనేం చెయ్యమంటే అవి చేస్తారు వీళ్ళు.
ఎన్ని మాయాజాలాలు సృష్టిస్తున్నాను దీంతో !.. నాలో ఇంత ఉత్సాహం, శక్తి ఇంకా ఉన్నాయని, నిస్సారమైన సంసార జీవితంలోని వడగాడ్పులకి అవి ఆవిరైపోలేదని ఇప్పుడే కదా తెలిసింది.
చదువుకునే రోజుల్లో రాసిన వ్యాసాలు, ప్రైజులు సంపాదించుకున్న కథలు మళ్ళీ ఇన్నాళ్ళకి ఇంకా రాయగలనని ఎప్పుడేనా అనుకున్నానా...?
నాకు తెలిసినవన్నీ అందరితో పంచుకుంటూ ఉంటే వాళ్ళు కెవ్వ్.....మంటూ వేసే కేకలు, నాకు వినిపించవని తెలిసినా వేసే ఈలలు, కొట్టే చప్పట్లు, వేసే మంగిడీలు(అవేమిటని అడక్కు...విను) నేను వేసే జోకులకు వాళ్ళు ఇచ్చే ROFL లు, అవన్నీ నాకెంత సంతోషం కలిగిస్తాయో నువ్వు ఊహించగలవా....? మరి....దీనిగురించి ఏం తెలుసునని నన్ను హెచ్చరించడానికి వచ్చావ్..?....చాల్లే...వెళ్ళు.
అప్పుడెప్పుడో చిన్నప్పుడు అర్థరాత్రి దాకా మేలుకొని కథలూ, కబుర్లూ రాసుకోవాలని కోరికున్నా అమ్మా నాన్న వేసే చీవాట్లకి భయపడి ముసుగు పెట్టుకొని పడుక్కున్నాను. పెళ్ళి, పిల్లలు, అర్థరాత్రి,అపరాత్రి పిల్లల పెంపకాలు....
ఓహ్.!..విసిగిపోయాను. మళ్ళీ ఇన్నాళ్ళకి నేను మనిషినయినట్టుంది. నా జీవితం నా చేతికొచ్చినట్టుంది.
ఓహ్.!..విసిగిపోయాను. మళ్ళీ ఇన్నాళ్ళకి నేను మనిషినయినట్టుంది. నా జీవితం నా చేతికొచ్చినట్టుంది.
నేనిప్పుడు మళ్ళీ తనివితీరా నవ్వుతున్నాను. నాకు కావలసినంత సేపు కబుర్లు చెప్పుకుంటున్నాను. ఇరుగమ్మ పొరుగమ్మలు అవసరం లేదు...ఆడ,మగ భేదం లేదు, పెద్ద-చిన్న తారతమ్యం లేదు. ఎదురుగా ఎవరూ లేకుండానే...ఎదురుగా ఉన్నట్టు ఫీలవుతూ హాయిగా సరదాగా మట్లాడుకోవచ్చు.
అవును...నేను మళ్ళీ మనిషినయ్యాను.
అవును...నేను మళ్ళీ మనిషినయ్యాను.
పిల్లలా...?.అవును. పిల్లలే. పెంచుతున్నాగా..కావలసినవన్నీ చేస్తూనే ఉన్నాగా. ఎంత ముద్దుగా పెంచాను. ఇప్పటికీ ముద్దలు కలిపితే గాని ముద్ద మింగకుండా ఉన్నారు. అయినా విసుక్కోకుండా పెడుతూనే ఉన్నా...కనిపెట్టుకొని అన్నీ చేస్తూనే ఉన్నా. జ్వరం వస్తే, దెబ్బ తగిలితే రాత్రింబగళ్ళు కనిపెట్టుకొని సేవ అని అనుకోకుండా మేలుకొని అన్ని చేస్తూనే ఉన్నా...ఏం ఒరిగింది.? ఇకపై ఏం ఒరగదని కూడా తెలుసు. అయినా కన్నందుకు బాధ్యత అనుకొని పెంచుతున్నాను. ఎన్ని పుల్లవిరుపు మాటలు, ఇరుగుపొరుగు ఏమన్నా అనుకుంటారని భయంలేకుండా ఆ అరుపులు, సాధింపులు.....అన్నీ మౌనంగానే భరిస్తున్నాగా."
"ఇంత అర్థరాత్రి వరకూ మేలుకొని....."
" సరేలే....నసగకు. నీకు మాత్రం తెలీనిదేముంది.? పగలు లేచిన దగ్గర్నుంచి ఎన్ని పనులు ? సరిగ్గా మూడ్ వచ్చి కూర్చుందామనుకునేసరికి పిల్లలూ తయారయిపోతారు నా పనికి అడ్డంగా - కొంచెం సేపమ్మా....! అంటూ.
ఆఖరికి ఆ కుర్చీ ఖాళీ అయి నా చేతికి వచ్చేసరికి మరి ఇంతరాత్రీ అవుతోంది. అయితే మాత్రం ఏం...ఇక నన్ను ఎవరూ ఆపలేరు."
ఆఖరికి ఆ కుర్చీ ఖాళీ అయి నా చేతికి వచ్చేసరికి మరి ఇంతరాత్రీ అవుతోంది. అయితే మాత్రం ఏం...ఇక నన్ను ఎవరూ ఆపలేరు."
"అందరూ గాఢనిద్రలోకి ఒరిగిపోతూ ఉంటే నాలో నవ చైతన్యం నిద్రలేస్తుంది. కొత్త కొత్త ఆలోచనలు పురులు విప్పుతాయి. కంప్యూటర్ మానిటర్ మీద పరచుకున్న తెల్లని కాగితం నన్ను ఉసిగొల్పుతుంది. ఇదివరకు ఏదేనా రాయాలంటే కాగితం,కలం వెతుక్కుంటూ గడపడంలోనే పుణ్యకాలం గడిచిపోయేది. రాయడం ఎప్పుడో మర్చిపోవడం వలన కొండదారిలా వంకరలు తిరుగుతున్న అక్షరాల మధ్య నేనేం రాస్తున్నానో నాకే తెలీక, కళ్ళజోడు లేకపోతే అక్షరాలు కనిపించని స్థితిలో ఏం రాయాలనుకున్నానో కూడా మర్చిపోయేదాన్ని.
కావ్యం రాయాలంటే ఎన్నో కావాలన్నాడు పెద్దాయన పెద్దన... మరి ఇప్పుడే కదూ! నాక్కూడా నాక్కావలసినవి సమకూరేయి.... అందుకే అర్థరాత్రయితేనేం....అపరాత్రయితేనేం...ఎంత వేళయితేనేం....మనిషంటే ప్రాణంతో తిరగడం కాదు. మనసుతో, మనసులతో కలిసిపోవడం.. పదిమందితో చావు కూడా పెళ్ళే నంటారు. అలాంటి సంతోషాలు, సంబరాలు అన్నీ నాకు ఇక్కడే దొరుకుతున్నాయి. ప్లీజ్...ఇవాళ్టికి నన్నొదిలేయ్...!..ఇవే మాటలు ఎన్నిసార్లు చెప్పమంటావ్ చెప్పూ...? వెళ్ళిపోమ్మా.....!
హమ్మయ్య....వెళ్ళిందిరా బాబూ.. ! "
టక..........టక...........
టక..........టక...........
టక..........టక...........
*** *** ***
" ఇదిగో....................నిన్నే.......!"
ఒక్కసారి ఇటు చూడు.........! ఎప్పుడూ నువ్వు పిలిస్తే వినపడనట్టుగా ఉండి, ఎప్పుడు పోతావా అని చూస్తున్నట్టుండే నేనే నిన్ను పిలుస్తున్నానని ... బెట్టా.....?
ప్లీజ్.... ఒకే ఒక్కసారి.. ఇకపైన నువ్వు నాదగ్గరికి రానక్కర్లేదుగా..ఇదే ఆఖరిసారిట.
మళ్ళీ మళ్ళీ నిన్ను పిలవనుగా. వస్తున్నావా...?
మళ్ళీ మళ్ళీ నిన్ను పిలవనుగా. వస్తున్నావా...?
అవును. నువ్వు నేను ఒకటే నని నాకు తెలీదా?! నువ్వు నా ఆల్టర్ ఇగోవి.
నాలో నీవే నీలో నేనని కన్వీనియంట్ గా మరిచిపోయాను.
ఎన్నిసార్లు చెప్పావు.......!
ఎన్నిసార్లు చెప్పావు.......!
ఊహల పల్లకీ దిగిరమ్మని.
విన్నానా..? విన్నట్టుగా ఉన్నానా?
అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందట అని నువ్వు చేసిన బోధని తుంగలో తొక్కాను.
ఇంటర్నెట్ ఎంత మాయలమారో కథలు కథలుగా ఎందరికో చెప్పాను. కానీ నేనే కాలుజారి అగాథంలోకి జారిపోతానని అనుకోలేదు.
తలచుకుంటే అంతా కలలా ఉంది.
విన్నానా..? విన్నట్టుగా ఉన్నానా?
అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందట అని నువ్వు చేసిన బోధని తుంగలో తొక్కాను.
ఇంటర్నెట్ ఎంత మాయలమారో కథలు కథలుగా ఎందరికో చెప్పాను. కానీ నేనే కాలుజారి అగాథంలోకి జారిపోతానని అనుకోలేదు.
తలచుకుంటే అంతా కలలా ఉంది.
మాయ...మాయ....సర్వం మాయ.......మధురమైన కల........కల లాంటి వాస్తవం..... పచ్చి వెలక్కాయలాగ గొంతుకడ్డు పడుతున్న కఠోర సత్యం!!
చేదువిషం జీవఫలం.
చేదువిషం జీవఫలం.
నిన్నటివరకు కలిసి మెలిసి మసలిన ఆ స్నేహితులంతా ఏరి?
ఇలా పాస్ వర్డ్ కొట్టగానే పలకరించే హాయ్ హాయ్ లన్నీ ఏవి...నన్ను మర్చిపోయారా అంతా.... లేదే!!
ఇలా పాస్ వర్డ్ కొట్టగానే పలకరించే హాయ్ హాయ్ లన్నీ ఏవి...నన్ను మర్చిపోయారా అంతా.... లేదే!!
ఎక్కడికి తొంగి చూసినా నా గురించే చెప్పుకుంటున్నారంతా. కానీ ఆ అభిమానమంతా ఏమయింది?
నేను మూర్తీభవించిన మోసాన్నిట. నా అంత కఠిన హృదయమే లేదట.
స్త్రీ సహజమయిన గుణాలేవీ నాలో లేవట. జాలి, దయ,కార్పణ్యం లేని బండరాయినట.
నేను మూర్తీభవించిన మోసాన్నిట. నా అంత కఠిన హృదయమే లేదట.
స్త్రీ సహజమయిన గుణాలేవీ నాలో లేవట. జాలి, దయ,కార్పణ్యం లేని బండరాయినట.
ఏమిటీ అభియోగం?
ఏమిటి నేను చేసిన మోసం?
నేనెవరి ప్రాణాలతో చెలగాటమాడాను?
ఏమిటి నేను చేసిన మోసం?
నేనెవరి ప్రాణాలతో చెలగాటమాడాను?
మండుటెండలో వాసంత సమీరంలా పలకరించే ఒక్క స్నేహం కోసం ఆరాటపడ్డాను.
అప్పుడెప్పుడో పారేసుకున్న జ్ఞాపకాలన్నీ ఇక్కడ వెతుక్కున్నాను.
నవ్వడం మరిచిపోయిన పెదవులకు సుమధుర హాసాన్నద్దుకున్నాను. కనీసం అలా అనుకున్నాను.
ప్రతి పలకరింపుకు తుళ్ళి తుళ్ళి పడ్డాను.
సమస్యల కడలితీరాన్ని నవ్వుల నావ ఎక్కి అవలీలగా చేరుకుంటున్నాననుకున్నాను...
అయిపోయింది.
అంతా సర్వనాశనం అయింది.
సమస్యల కడలితీరాన్ని నవ్వుల నావ ఎక్కి అవలీలగా చేరుకుంటున్నాననుకున్నాను...
అయిపోయింది.
అంతా సర్వనాశనం అయింది.
ఇక్కడ నా పేరు చెప్పుకోకుండానే ఎన్నో చేస్తున్నానని సంబర పడ్డాను.
నా పేరే చెప్పుకొని ఎవరో ఎన్నో చేస్తున్నారని తెలుసుకోలేకపోయాను.
నన్నే బలి చేస్తారని కానుకోలేకపోయాను.
నా పేరే చెప్పుకొని ఎవరో ఎన్నో చేస్తున్నారని తెలుసుకోలేకపోయాను.
నన్నే బలి చేస్తారని కానుకోలేకపోయాను.
నాలాగే ఒక చిన్న పలకరింపుకోసం ఎదురుచూస్తూ ఉన్న ఒక హృదయం, ప్రేమకోసం తపించిపోయే ఒక ప్రాణం నా పేరు మీద వచ్చే లేఖలతో పునర్జీవం పోసుకుందని, తీరా అది ఉత్తి భ్రమేనని తెలిసాక ఉసురులు తీసుకుందని అందరూ చెప్పుకుంటున్నారు.
నేను రాయని ప్రేమలేఖలు, నేను చేయని బాసలు, నేనే చేసానని అందరూ అంటుంటే నన్ను నేను నిరూపించుకునేదెలా...?
నేను తాను కానని తెలుపుకునేదెలా...?
నాకున్న మిడిమిడి జ్ఞానంతో -
కిం కర్తవ్యం ????????
నేను రాయని ప్రేమలేఖలు, నేను చేయని బాసలు, నేనే చేసానని అందరూ అంటుంటే నన్ను నేను నిరూపించుకునేదెలా...?
నేను తాను కానని తెలుపుకునేదెలా...?
నాకున్న మిడిమిడి జ్ఞానంతో -
కిం కర్తవ్యం ????????
ఇప్పుడింక చేయగలిగినది ఏముంది......!!
అంతర్జాలనాటకంలో నా పాత్రని నేనే హత్యచేసుకోవడం తప్ప.............!.!
రంగుల హంగులద్దుకున్న నా రెక్కలతో సీతాకోక చిలకలా స్వేచ్ఛగా ఎగిరిపోవాలనుకున్నాను.
కానీ...నాకు నేనే కట్టుకున్న నా నిద్రాకోశంలోకి తిరిగి వెళ్ళిపోతున్నాను....
సగం సగం తిన్న కలలను నెమరేస్తూ.
గొంగళీలా.
"ఎవరో జ్వాలను రగిలించారూ....వేరెవరో దానికి బలి అయినారు.......... "
ప్లేలిస్టులో మరో పాట ప్లే అవుతోంది.
ప్లేలిస్టులో మరో పాట ప్లే అవుతోంది.
yemaindandi. vishayam teliyadu kaani chaduvutunta baadaga undi
ReplyDeleteమురళిగారు, అంతర్జాలంలో జరిగాయి అని విన్న సంఘటనలకు కొంత కల్పన జోడించి రాసిన చిన్న విషయం అంతే. నిజం కాదు.
ReplyDeleteఇకముందు ఇలాంటి సమస్యలు రాబోతాయేమో అన్న దిగులు కూడా ఉంది.
ముఖ్యంగా సాంకేతికమైన విషయాల గురించి సరైన జ్ఞానం లేకపోతే...ఈ ఆధునిక కాలంలోని విజ్ఞానంతో చాలా సమస్యలు ఎదురౌతాయి. మనకన్నా నాలుగాకులు ఎక్కువ చదివిన వాళ్ళు ఎప్పుడూ ఉంటారు.అందుకే మోసాలు అంత పకడ్బందీగా జరుగుతున్నాయి.
కొంచెం టెక్నిక్ మార్చి రాసాను అనుకున్నాను. నేను చెప్పిన విషయంలోనో, విధానంలోనే ఎక్కడో తేడా వచ్చిందనుకుంటా ....మీరొక్కరు రాసారు కామెంట్.
ధన్యవాదాలు.
@అనానిమస్ గారు, క్షమించండి. ఏదో తొందరపాటులో అది వేసేసి రాసాను.
ReplyDeleteతీసేద్దామంటే అక్కడ ఆ డబ్బా ఒకంతట కనిపించలేదు..ఇప్పుడు తీసేసాను.
మరోసారి క్షమాపణలు మీకు.